23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నవ్విస్తూ భయపెడతానంటున్న హీరోయిన్ రితిక చక్రవర్తి

షకలక శంకర్ హీరోగా.. రితిక చక్రవర్తి హీరోయిన్ గా ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’ సినిమాను కొత్త డైరెక్టర్ కుమార్ కోట తీస్తున్నాడు.  మ‌ణిదీప్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించింది.

‘షకలక శంకర్ గారి వైఫ్ రోల్ లో సుజి పాత్రలో కన్పిస్తాను. షకలక శంకర్, దర్శక, నిర్మాతల సహకారం మరచిపోలేను. మేమందరం ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్లి వచ్చినట్లుగా సినిమాను పూర్తి చేశాం. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఇందులో చిన్న హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. నేను నటించిన మొదటి సినిమా అయినా సెట్స్ లో అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. తెలుగులో నేను ఒక మంచి సినిమాతో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నపుడు కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. త్వరలో వాటి వివరాలు తెలుపుతాను.’ అని  రితిక చక్రవర్తి చెప్పింది.

- Advertisement -

Latest news

Related news