ఉప్పెన దర్శక నిర్మాతలు భయపడిందే జరిగింది. మెగాస్టార్ చిరంజీవికి మైక్ దొరికితే చాలు సినిమాలోని రహస్యాలను లీక్ చేసేస్తడు అన్న మాటను నిలబెట్టుకుంటూ తాజాగా ఉప్పెన సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ ని లీక్ చేశాడు. ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్.. తనకు తెలియకుండానే సినిమాలో కీలకమైన క్లైమాక్స్ విషయాలు చెప్పేశాడు.
‘ఉప్పెన క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. అలాంటి ముగింపు తెలుగు సినిమాల్లో చూడటం కష్టమే. అని చిరు చెప్పాడు. ఓ రేర్ క్లైమాక్స్ ని డైరెక్టర్ బుచ్చిబాబు రాసుకున్నాడు.’ అంటూ చిరు క్లైమాక్స్ గురించి హింట్ ఇచ్చేసాడు. ‘క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా చెప్పడానికి బుచ్చిబాబు చాలా ప్రయత్నించాడు. అలాంటి క్లైమాక్స్ చెప్తున్నపుడు డైరెక్టర్లు భయపడతరు. కానీ బుచ్చిబాబు మాత్రం చాలా డేరింగ్ గా చెప్పాడు.’ అంటూ అసలు విషయాన్ని కూల్ గా చెప్పేశాడు. దీంతోపాటు ‘క్లైమాక్స్ లో హీరోయిన్, ఆమె తండ్రి మధ్య వచ్చే సీన్ కూడా చాలా బాగుందని’ క్లైమాక్స్ లోని సీన్ గురించి తనకు తెలియకుండానే లీక్ చేసేశాడు.
‘ఉప్పెన క్లైమాక్స్ లో డైరెక్టర్ హీరో హీరోయిన్లను చంపేస్తారు’ అనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. దీనికి బలం చేకూర్చేలా చిరంజీవి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సినిమా ఈవెంట్లలో చిరంజీవి నోరుజారి సినిమాల్లోని కీలక విషయాలను లీక్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో ఆచార్య టైటిల్ విషయంలోనూ ఇలానే చెప్పేశాడు. రంగస్థలం ఆడియో వేడుకలో పాల్గొని సందర్భంలో క్లైమాక్స్ కంటే ముందే ఆది చచ్చిపోతాడని చెప్పేశాడు.