తమకు నచ్చిన హీరోయిన్స్, హీరోలకు ఇష్టమైనవి తెలసుకునేందుకు ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపుతారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నాలకు సెలబ్రెటీలు ఆన్సర్లు ఇయ్యడంతోపాటు వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో దీపికాను తన ఫ్యాన్స్ ఇష్టమైన ఫుడ్ ఏంటని అడగగా.. తనకు ఇష్టమైన సౌతిండియా ఫుడ్ గురించి వివరించింది.
సౌత్ ఇండియాలో చేసే రసం అంటే తనకు చాలా ఇష్టమట. అన్నంతోపాటు రసం కలిపి తినడాన్ని తాను ఎంజాయ్ చేస్తా అంటూ దీపికా వీడియోలో చెప్పుకొచ్చింది. అదే సమయంలో తన పక్కన ఉన్న అనన్య పాండేకు సైతం సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం అంటూ పకపక నవ్వేసింది.