సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత 49వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నమ్రతకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల ట్విటర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసింది. దీంతోపాటు తనతో దిగిన అరుదైన ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోను ఇటు మహేష్ బాబు అభిమానులు అటు మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
1993లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రత.. ’వంశీ’ సినిమాతో టాలీవుడ్లో ప్రవేశించింది. తన తొలి హీరో అయిన మహేష్ బాబునే ప్రేమించి 2005 ఫిబ్రవరిలో పెండ్లి చేసుకుంది. వీరికి గౌతమ్ కృష్ణ, సితార ఇద్దరు పిల్లలు.