29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

‘ఉప్పెన’ మరో సాంగ్.. రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ నుంచి మరో సాంగ్ రిలీజైంది. ‘జల జల జలపాతం..’ అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ దేవరకొండ విడుద‌ల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించగా.. జ‌స్‌ప్రీత్ జ‌స్‌, శ్రేయా ఘోష‌ల్ పాడారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీపసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు(‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’, ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’, ‘రంగులద్దుకున్న’) విడుదల కాగా.. తాజాగా నాలుగో పాట రిలీజైంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది.

- Advertisement -

Latest news

Related news