మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ ని నిర్మాతలు ప్రకటించారు. ఇటీవల విడుదల అయిన ఉప్పెన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ‘దక్ దక్ దక్’ పాట కూడా అంతే హిట్ అయ్యింది.
ఉప్పెనను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఫిబ్రవరి 19న నితిన్ నటించిన చెక్ సినిమా విడుదల కానుంది. దీని కంటే ముందే ఉప్పెన థియేటర్లలో సందడి చేయనుంది.
ఇందులో కీర్తీ శెట్టి ఫీమెల్ లీడ్ రోల్లో కన్పిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.