నీ కన్ను నీలి సముద్రం అంటూ ఉప్పెనలో సాంగ్ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క పాటతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. ‘ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తిండిపోయేలా బ్రతికేద్దాం..’ అంటూ హీరోయిన్ చెప్పే మాటలు టీజర్ లో కొత్తగా అనిపించాయి. చేపలు పట్టే ఓ అబ్బాయి, ధనిక కుంటుంబంలోని అమ్మాయి మధ్య ప్రేమకథగా ఈ సినిమా రూపొందింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా నటించాడు. మంచి ఫీల్ గుడ్, డిఫరెంట్ లవ్‌స్టోరిగా సినిమా ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.