పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ డేట్ దగ్గరకొచ్చేసింది. సంక్రాంతి కానుకగా.. రేపు సాయంత్రం 6:03 గంటలకు టీజర్ రిలీజ్ అవ్వబోతోంది.

హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీకి ఇది తెలుగు రీమేక్. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించారు. ఇప్పటికే ఇందులో తమన్ కంపోజ్ చేసి, సిద్ శ్రీరాం పాడిన మగువా సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇక రేపు రాబోయే టీజర్ ఎన్ని మిలియన్ల వ్యూస్ రీచ్ అవుతుందో, ఎన్ని యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.