టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ వకీల్‌సాబ్ సినిమాతో త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అందులో పవన్ డైలాగ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని పవన్ కల్యాణ్ గూండాలపై పంచ్ విసురుతున్న స్టిల్ ను నిఖిల్ అనుదీప్ డిజైనర్ డిజిటల్ ఆర్ట్ రూపంలో డిజైన్ చేశాడు. అచ్చం కామిక్ బుక్ పై హీరోలా పవన్ కన్పిస్తున్నాడు. ‘వావ్..వెల్డన్ నిఖిల్ అంటూ’ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నిఖిల్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆ ఫోటోని ట్వీటారు. ఆ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
దిల్‌రాజు-బోనీకపూర్ సంయుక్త నిర్మించిన వకీల్‌సాబ్ సినిమాలో ప్రకాశ్‌రాజ్, శృతిహాసన్ నటిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ డైరెక్టర్.