29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఓటీటీల మధ్య వార్.. అసలేం జరిగిందంటే..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అంతకు ముందు నుంచే ఉన్నా.. లాక్ డౌన్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాయి. దాదాపు సినిమా హాళ్లను మరిచిపోయేంతలా ఓటీటీ సామాన్యుడికి కనెక్ట్ అయింది. థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ఓటీటీల్లో మాత్రమే వచ్చే ఒరిజినల్స్‌కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఒరిజినల్స్ పేరుతో రెండు ఓటీటీల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ఎవరెవరి మధ్య అంటే..


రీసెంట్‌గా ఓటీటీలో కింగ్ అయిన నెట్‌ఫ్లిక్స్.. అచ్చ తెలుగు ఓటీటీ అయిన ‘ఆహా’ మధ్య చిన్నపాటి ట్వీట్ వార్ నడిచింది. ఇలా ఓటీటీలు కొట్టుకోవడం ప్రేక్షకులకు కొత్తగా ఉంది.

కలర్ ఫొటో, సూపర్ ఓవర్, కంబాలపల్లి కథలు, సామ్ జామ్ లాంటివాటితో తెలుగు ఆడియెన్స్‌కు బాగా దగ్గరైన ‘ఆహా’.. అచ్చంగా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లను తీసుకొస్తుంది. అలాగే మిగతా భాషల్లో హిట్ అయిన సినిమాలు తెలుగులో డబ్ చేస్తుంది. ఇలా అచ్చంగా తెలుగు కంటెంట్ మీదనే పని చేస్తుంది. అందుకేనేమో మరో ఓటీటీ తెలుగు ఒరిజినల్స్ అనగానే రియాక్ట్ అయింది.
పిట్ట కథలు ఆంథాలజీ మూవీని ప్రస్తావిస్తూ.. “నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్స్ త్వరలో మీ ముందుకు..” , “మీ తెలుగు స్కిల్స్ బ్రష్ అప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా?” అని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌కు ‘ఆహా’.. స్పందిస్తూ.. “మనది ఎలాగూ హండ్రెడ్ పర్సెంట్ తెలుగే కదా? బ్రషింగ్‌లు అవసరం లేదు..అయినా మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి. అరుస్తున్నామా?” అని కౌంటర్ పోస్ట్ చేసింది.
దీనిపై కాస్త లేట్‌గా రియాక్ట్ అయిన నెట్‌ఫ్లిక్స్ వరుస కౌంటర్‌లు ఇస్తోంది. “ఆహా” పేరుని డైరెక్ట్‌గా ప్రస్తావించకుండా.. తెలుగులో కొన్ని పోస్ట్‌లు పెట్టింది.”నో ఫైటింగ్.. బాధ్యత ఉండక్కర్లే” అని మీమ్ పెట్టి.. వీడు, వీడి వేషాలు అని కామెంట్ చేసింది. మరో పోస్ట్ లో “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను”అనే మీమ్ పోస్ట్ చేసి.. “ఏరా మీ ఇంట్లో అందరూ ఇలాగే తేడాగానే మాట్లాడతారా?” అని కామెంట్ చేసింది.

ఈ వార్నింగ్‌లు ‘ఆహా’ను ఉద్దేశించినవే అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఈ వార్ కు సంబంధించి “‘ఆహా’ ముందుగా ఎందుకు రెచ్చగొట్టాలి?” అంటూ నెట్‌ఫ్లిక్స్‌కు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. “బయట నుంచి వచ్చావ్.. పని చూసుకుని వెళ్లు.. అంతేగాని గొడవలు పెట్టుకోకు” అని ఆహాకు మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇకొంతమంది మాత్రం అసలీ వార్ ఎంట్రా బాబు.. ఎవరి కంటెంట్ వాళ్లు ప్రజెంట్ చేయొచ్చుగా.. ఇవన్నీ ఎందుకు అంటున్నారు.

- Advertisement -

Latest news

Related news