డేవిడ్ వార్నర్.. క్రికెట్లో ఎంత పాపులరో.. టిక్‌టాక్‌లో కూడా అంతే పాపులర్. అందులోనూ ముఖ్యంగా తెలుగు పాటలు టిక్‌టాక్ చేసి తెలుగువాళ్లందరరికీ ఫేవరెట్ అయ్యాడు. వచ్చిరాని స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు చూడబోయేది వార్నర్ 2.0. ఇందులో తెలుగు, తమిళ్ లేదు.. అన్ని భాషలు, అందరూ హీరోలను వాడేస్తున్నాడు. అయితే ఈ సారి కష్టపడకుండా సింపుల్ గా ఓ టెక్నిక్‌తో అందర్నీ నవ్విస్తున్నాడు. అదెలాగంటే..
ఈ సారి వార్నర్ టిక్‌టాక్ కాకుండా రీఫేస్ యాప్ సాయంతో వెరైటీ వీడియోలు చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు, మిస్టర్ బీన్ ఇలా అందరి ముఖాలకు తన ముఖాన్ని అతికించి నవ్విస్తున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలు మీరూ చూసేయండి.
