టిక్‌టాక్ వీడియోలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్.. రీసెంట్ గా రీఫేస్ వీడియోలు మొదలుపెట్టాడు. బాలీవుడ్ బడా హీరోల నుంచి మొదలు పెడితే.. టాలీవుడ్ వరకు హీరోల వరకూ అన్ని క్యారెక్టర్స్ తన ఫేస్‌ను సెట్ చేసిన వీడియోలు చేస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయాడు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ టీజర్‌ను రీఫేస్ చేసి హల్ చల్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆచార్యగా మారిన వార్నర్‌పై ఓ లుక్కేయండి..