29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

త్వరలో మరో మెగా పెళ్లి

టాలీవుడ్ లో పెళ్లి కావల్సిన మెగా హీరోలు క్యూలో ఉన్నారు. అయితే త్వరలోనే వీరిలో ఒకరి పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లిసందడి షురూ అవ్వనుందని టాలీవుడ్ లో టాక్.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..
నిహారిక పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీ.. మిగతా బ్యాచిలర్స్ పెళ్లి గురించి ఆలోచనలో పడింది. ఆ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు లైమ్ లైన్ లోకి వచ్చాయి.
ఇటీవల సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిహారిక వివాహం తరువాత తన పెళ్లిపై కుటుంబం ఒత్తిడి చేస్తోందని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ మాటలు నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే మేనల్లుడి కోసం చిరంజీవి తన చెల్లితో కలిసి అమ్మాయిని కూడా సెలక్ట్ చేశారని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని ఆ అమ్మాయి మెగా ఫ్యామిలీ కి బాగా పరిచయం ఉన్న అమ్మాయి అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి వార్తలపై క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

Latest news

Related news