29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

‘కేజీఎఫ్-2’కు యష్ రెమ్యూనరేషన్ లీక్..

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ -2’ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ కానుంది. దాదాపు రూ.140 నుంచి రూ.160 కోట్లు పెట్టి చాఫ్టర్-2 తీస్తున్నారు. తొలి భాగానికి రూ.70 కోట్లు పెడితే రూ.200 కోట్లు వచ్చాయి. సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు పెరగడంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో తీయడంతో కేజీఎఫ్ చాప్టర్ -2 కు నిర్మాతలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. దీనికితోడు బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ తోపాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటులను చాప్టర్ 2 కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసుకున్నారు. వీరికి భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పారు.

కేజీఎఫ్ హీరో యశ్ నేషనల్ స్టార్ హీరో అయిపోయాడు. తొలి భాగం కోసం ఆయన దాదాపు రూ.11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే.. రెండో భాగానికి ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికితోడు సినిమా లాభంలో షేర్ కూడా తీసుకోనున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కేజీఎఫ్ 2 దాదాపు రూ.270 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news