23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

అమెరికాలో ఇండో అమెరికన్లకు కీలక పదవులు

అగ్రరాజ్యం అమెరికాలో ఇండో- అమెరికన్లకు కీలక పదవులు దక్కుతున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన విజయ్‌ శంకర్‌ను వాషింగ్టన్‌ న్యాయస్థానానికి జడ్జిగా నామినేట్‌ చేశారు ట్రంప్‌. దేశాధ్యక్షుడి నిర్ణయానికి సెనేట్‌ ఆమోదం లభిస్తే.. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అసోసియేట్‌ జడ్జిగా సేవలు అందించనున్నారు శంకర్‌.  డ్యూక్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన ఆయన.. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. వర్జీనియా లా రివ్యూ నోట్స్‌ ఎడిటర్‌గా పనిచేశారు. ఇక ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ క్రిమినల్‌ విభాగంలో సీనియర్‌ లిటిగేషన్‌ కౌన్సెల్‌గా ఉన్న విజయ్‌ శంకర్‌.. అప్పీలెట్‌ సెక్షన్‌ డిప్యూటీ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...