18 C
Hyderabad
Friday, November 27, 2020

అమెరికాలో ఉత్కంఠగా కొనసాగుతున్న పోలింగ్‌

శ్వేతసౌధంలో ఎవరు కొలువు దీరుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా రాష్ట్రాల వారీగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌పై  పైచేయి సాధించారు జో బైడెన్. ఇప్ప‌టికే ఫ‌లితాలు వెలువ‌డిన రాష్ట్రాల్లో ట్రంప్ నాలుగు రాష్ట్రాల్లో విజ‌యం సాధించ‌గా, బైడెన్ ఐదు రాష్ట్రాల్లో గెలుపొందారు. మ‌రో నాలుగు రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. వెస్ట్ వ‌ర్జీనియా, కెంట‌కీ, ఇండియానా, సౌత్ క‌రోలైనా రాష్ట్రాల్లో ట్రంప్ విజ‌యం సాధించ‌గా, వ‌ర్జీనియా, వెర్మాంట్‌, మేరిల్యాండ్, న్యూజెర్సీ, మ‌సాచుసెట్స్ రాష్ట్రాల్లో బైడెన్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. అదేవిధంగా టెక్నాస్‌,జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంషైర్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధ్యిక్యంలో కొన‌సాగుతున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా…అందులో 270 ఎలక్టోరల్ ఓట్లు గెల్చుకున్నవారు అధ్యక్షపదవిని సొంతం చేసుకోనున్నారు. కాలిఫోర్నియాలో అత్య‌ధికంగా 55 ఓట్లు ఉండ‌గా, టెక్నాస్‌లో 38, న్యూయార్క్‌లో 29, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఇల్లినాయిస్‌లో 20 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉండ‌గా, 30 రాష్ట్రాల్లో 10 కంటే త‌క్కువ ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. దీంతో ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...