19.8 C
Hyderabad
Monday, November 30, 2020

అమెరికాలో ట్రంప్ వర్గీయుల ఆందోళన

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపును ఒప్పుకోవడం లేదు ట్రంప్ వర్గీయులు. ఆయనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వేలాది మంది మద్దతుదారులు….వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వాషింగ్టన్‌ లో మిలియన్ మేక్‌ అమెరికా గ్రేట్ అగైన్ పేరిటన నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మళ్లీ గెలిచినట్లు ప్రకటించాలని నినాదాలు చేశారు. జో బైడెన్‌కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో బైడెన్ వర్గీయులపై హింసాకాండకు పాల్పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో బైడెన్ వర్గీయులపై దాడులు చేయగా, మరికొన్ని చోట్ల పోలీసులపై కూడా ట్రంప్ మద్దతుదారులు దాడులకు దిగారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు కాస్త దిగొచ్చారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలిచారని చెప్పారు. అయితే ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరగడం వల్లే బైడెన్‌ విజయం సాధించారని ట్రంప్‌ ఆరోపించారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.