అందరికి పన్నులు కట్టాలంటూ సలహాలిచ్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం మాట తప్పుతున్నారు. ట్రంప్ కొన్నేళ్ల నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ సరిగా కట్టడం లేదంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. 2016-17లో ఆయన 750 డాలర్లు మాత్రమే ట్యాక్స్ చెల్లించినట్లు రాసుకొచ్చింది. రెండు దశాబ్ధాలకు చెందిన ట్రంప్ ఆదాయపన్ను వివరాలను కథనాల్లో పొందుపర్చింది న్యూయార్క్ టైమ్స్. దీర్ఘకాలికమైన నష్టాలను సాకుగా చూపుతూ.. సుమారు పదేళ్లు ట్రంప్ కంపెనీలు ట్యాక్స్ ను ఎగవేసినట్లుతేల్చి చెప్పింది. అయితే న్యూయార్క్ టైమ్స్ వార్తలను ఖండించారు ట్రంప్. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు