24.8 C
Hyderabad
Friday, October 23, 2020

అమెరికాలో రెచ్చిపోయిన హ్యాకర్లు

అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు. హై ప్రొఫైల్‌ ట్విటర్‌ ఐడీలే లక్ష్యంగా .. వారి అకౌంట్లను హ్యాక్‌  చేశారు. బిట్‌కాయిన్‌ అడ్రస్‌కి వెయ్యి డాలర్లు పంపిస్తే.. రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్స్‌ చేశారు. హ్యాకింగ్‌ కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌, అపర కుబేరులు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, నటి కిమ్‌ కర్ధాషియన్‌ లతోపాటూ పలువురు ప్రముఖులు ఉన్నారు. హ్యాకింగ్‌ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సే. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు

- Advertisement -

Latest news

Related news

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...

బ్రెజిల్‌ లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ మృతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌ లో ఓ వలంటీరు మృతి చెందాడు. ఈ...