అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ట్రంప్ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. లైంగికంగా వేధించారంటూ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మోడల్ అమీ డోరిస్. తనను పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారన్నారు. 1997లో న్యూయార్క్‌లో జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా ట్రంప్ వీఐపీ సూట్ లో తనపట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారన్నారు. తన కూతుర్లకు రోల్ మోడల్‌గా ఉండేందుకే ఇన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చానంటున్నారు డోరిస్.