24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి చర్చ జరిగింది. దేశంలో కరోనా మరణాల రేటు తగ్గిందన్న ట్రంప్‌.. కొద్ది రోజుల్లో వాక్సిన్‌‌ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్మీ సాయంతో టీకాను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అమెరికాలో 99శాతం మంది కరోనాను జయించారన్న ట్రంప్‌..  విద్యాసంస్థలు తిరిగి తెరవనున్నట్లు చెప్పారు.అయితే కరోనా కట్టడిలో ట్రంప్‌ విఫలమయ్యారని ఆరోపించారు బిడెన్‌. వైరస్‌ విషయంలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా మేలుకుందన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని విమర్శించారు. కరోనా అధిక మరణాలకు కారణమైన ట్రంప్‌ కు..అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు బిడెన్‌.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...