26 C
Hyderabad
Wednesday, August 12, 2020

అమెరికా – చైనా మధ్య మాటల యుద్ధం

అమెరికా చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు హెచ్చరికల స్థాయిని దాటి చర్యలకు పూనుకుంటున్నాయి. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ లోని వీగర్‌ ముస్లింల పట్ల చైనా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని చాలాకాలంగా ఆరోపిస్తున్న అమెరికా రాజకీయ ఆంక్షలకు ఉపక్రమించింది. చైనాలోని అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యదర్శి, రీజనల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధినేత  చెన్‌ క్యూయాంగో సహా మరో ముగ్గురు ఉన్నతస్థాయి అధికారులపై పలు ఆంక్షలు విధించింది. వీటి ప్రకారం ఈ నలుగురితో అమెరికన్లు ఎవరూ వ్యాపారం చేయకూడదు. అమెరికాలో ఉన్న వీరి ఆస్తులను స్తంభింపజేస్తారు. అంతేకాకుండా వీరు అమెరికా రావడంపైన కూడా నిషేధం ఉంటుంది. ఈ ఆంక్షలు వారి కుటుంబసభ్యులకు కూడా వర్తిస్తాయని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. జిన్‌జియాంగ్‌లో వీగర్లపై జరుగుతున్న భయంకరమైన అకృత్యాలు, అరాచకాలపై తాము ఈ విధంగా చర్యలకు ఉపక్రమించినట్టు చెప్పింది. చైనా అరాచకాలను తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. అటు అమెరికా నిర్ణయంపై చైనా కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికాది తప్పుడు నిర్ణయమని, దాన్ని సరిదిద్దుకోకపోతే తాము కూడా చర్యలకు దిగుతామని హెచ్చరించింది. అమెరికా నిర్ణయం చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, ఇది ఇరుదేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చైనా విదేశాంగ   శాఖ పేర్కొంది.

జిన్‌జియాంగ్‌లో కోటి మందికిపైగా వీగర్‌ ముస్లింలు ఉన్నారు. వీరిలో చాలా మంది టర్కీ మూలాలు ఉన్నవారే. ఈ ప్రాంతంలో ఒకప్పుడు వీరే మెజారిటీగా ఉండేవారు. కానీ క్రమంగా వారి సంఖ్య తగ్గిపోతుంది. జిన్‌జియాంగ్‌లో ఇప్పుడు వీరి జనాభా కేవలం 45 శాతం లోపే ఉంది. చైనా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం వల్లనే వీగర్ల జనాభా తగ్గిపోతున్నదని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాకుండా వొకేషనల్‌ ట్రైనింగ్‌ క్యాంపుల పేరిట 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్టు ఆరోపణలున్నాయి. మత ప్రార్థనలు, బుర్ఖా ధరించడం, ఇతర మత విశ్వాసాలు పాటిస్తున్నందుకే వీరిని జైళ్ల లాంటి క్యాంపుల్లో పెడుతున్నారని తెలుస్తోంది. చైనా చర్యలకు వ్యతిరేకంగా 2009లో జిన్‌జియాంగ్‌లో జరిగిన నిరసనల్లో 159 మంది వీగర్లు చనిపోయారు. దీనిపై అమెరికా చాలా కాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీగర్లపై చైనా వేధింపులకు సంబంధించి గత నెలలో చైనా స్కాలర్‌ ఆడ్రియన్‌ జెంజ్‌  ఓ నివేదిక విడుదల చేశారు. దీనిపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు చేయాలని డిమాండ్లు వచ్చాయి. అయితే చైనా మాత్రం తాము ఎలాంటి అకృత్యాలకు పాల్పడటం లేదని వాదిస్తుంది.

కొంత కాలంగా అమెరికా, చైనా రెండు దేశాల మధ్య అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొంది. కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేస్తూ అంతర్జాతీయ సమాజంలో చైనాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ దిశగా ఆయన కొంత మేర విజయవంతమయ్యారు. రెండు దేశాల మధ్య విభేదాలు హాంకాంగ్‌లో భద్రతా బిల్లుతో మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే భారత్‌, చైనా సరిహద్దు గొడవ అంశంలో అమెరికా భారత్‌కు సంపూర్ణ మద్దతునిచ్చింది. తమ ఆర్మీ భారత్‌ వెంటే ఉంటుందని  ప్రకటించింది. తద్వారా చైనాకు తాము ఒక్కటేనన్న హెచ్చరికలు పంపింది.

చైనా, అమెరికా మధ్య విభేదాలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. చైనాతో వివాదం ఉన్న దేశాలకు అమెరికా వ్యూహాత్మకంగా మద్దతిస్తోంది. భారత్‌లో చైనా యాప్‌ల నిషేధానికి అమెరికా మద్దతు తెలిపింది. తాము కూడా నిషేధిస్తామని ప్రకటించింది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా కూడా యాప్‌లను నిషేదిస్తామని పేర్కొంది. హాంకాంగ్‌ నుంచి వచ్చే వారికి ఆశ్రయం ఇస్తామని, అందుకు ప్రత్యేక బిల్లును తెస్తామని వెల్లడించింది. చైనాకు మేం వ్యతిరేకమని చెప్పకనే చెప్పింది.  అదే సమయంలో అమెరికా చైనాతో సన్నిహితంగా ఉన్న దేశాలపై ఆంక్షలు విధిస్తూ తనదారికి తెచ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు చైనా కూడా ఇతర దేశాల మద్దతు కూడగట్టుకుంటుంది. అమెరికాతో సఖ్యత లేని దేశాలతో స్నేహం చేస్తుంది. ఆయా దేశాల్లో పెట్టుబడులు పెడుతుంది. దీంతో మరో ప్రచ్చన్న యుద్ధ ఛాయలు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌, అమెరికా కేంద్రంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగితే.. ఇప్పుడు సోవియట్‌ స్థానంలో చైనా ఉన్నదని చెప్తున్నారు.

- Advertisement -

Latest news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

Related news

దక్షిణ కొరియాలో వర్ష బీభత్సం…. 56మంది మృతి

సౌత్‌ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి 48గంటల్లోనే 56మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వేలాది మంది రోడ్డున పడ్డారు....

కరోనా వైరస్ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది: సీఎం కేసీఆర్

కరోనా అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని, దేశంలో వైద్య సదుపాయలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో...

బిలియనీర్ల జాబితాలో యాపిల్‌ కంపెనీ సీఈఓ

యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ పెరగడంతో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి టీమ్‌ కుక్‌ ఆస్తులు అమాంతం పెరిగాయి....

లాల్ పోరా, లోలాబ్ లో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉదయం జమ్ము కశ్మీర్లో ముష్కరుల కుట్రను భగ్నం చేశాయి. లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు...