24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెరపడింది. అగ్రరాజ్య చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, హోరాహోరిగా సాగిన ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పై విజయ భేరి మోగించారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకుగానూ బైడెన్ 290 ఓట్లు సాధించి నట్లు అసోసియేట్‌ ప్రెస్‌ వార్తా సంస్థ వెల్లడించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ 214 ఓట్ల దగ్గరే నిలిచిపోయారు. సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో విజయంతో బైడెన్‌ ..మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని దాటారు.

అటు అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 230 యేండ్లుగా పురుషులకే సొంతమైన రెండో అత్యున్నత పీఠంపై ఓ మహిళ కొలువుదీరనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపుతో భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్నారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యాక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అలాగే ఆ పదవి చేపట్టనున్న తొలి నల్లజాతి, ఆఫ్రో అమెరికన్‌గానూ ఆమె ఘనత వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బైడెన్‌, కమలా హారీస్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

77 ఏళ్ల వయస్సులో అగ్ర రాజ్య అధ్యక్ష పదవి చేపట్టే వ్యక్తిగా జో బైడెన్ చరిత్ర సృష్టించారు. ఎవరూ ఊహించని రీతిలో స్వింగ్ రాష్ట్రాల్లోనూ విజయ దుందుభి మోగించారు. 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎట్టకేలకు అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్నారు. సర్వేలన్నీ బైడెన్కే అనుకూలంగా వచ్చినప్పటికీ పోటీ రసవత్తరంగా సాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో అత్యధికులు ‘జో’కే జై కొట్టారు. ఫలితంగా కీలక రాష్ట్రాల్లో స్వల్ప వ్యత్యాసంతో ట్రంప్ను అధిగమించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమే అమెరికా జై బైడెన్ అనేలా చేసింది. ట్రంప్ పాలన వైఫల్యాలు కూడా బైడెన్ విజయ సోపానాలయ్యాయి. ఆరోగ్య రంగాన్ని ట్రంప్ నిర్లక్ష్యం చేయడం.. అదే సమయంలో కరోనా కాటుకు అమెరికన్లు భారీగా చనిపోవడం అక్కడి ప్రజలను కలిచివేసింది. అరోగ్య రంగానికి ప్రాధాన్యమిస్తానని బైడెన్ ముందునుంచీ సగటు అమెరికన్ పౌరుడికి హామీ ఇవ్వడం ఆయన గెలుపునకు దారితీసింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించటం పట్ల ట్విట్టర్ వేదికగా జో బైడెన్ స్పందించారు. అమెరికాలాంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించటానికి తనను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అటు అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపుతో అమెరికా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...