ట్రంప్ కు కరోనా సోకిందన్న వార్తలు అమెరికా స్టాక్ మార్కెట్లను షేక్ చేశాయి. కరోనా పాజిటీవ్ అంటూ ట్రంప్ ట్వీట్ చేసిన మరుక్షణం ఇన్వెస్టర్ల అమ్మకాలతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. డౌ ఫ్యూచర్స్ 500 పాయింట్లు, నాస్ డాక్ ఫ్యూచర్స్ 1.7 శాతం పడిపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ కరోనా బారిన పడటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే రెండవసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ ఈసారి కాస్త వెనుకంజలో ఉన్నారన్న ఒపీనియన్ పోల్స్ రిపబ్లికన్లను ఆందోళనకు గురి చేస్తోంది.