ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 20మంది మృతి చెందగా .. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పర్యాటకుల స్వర్గధామం, అత్యంత సురక్షిత ప్రాంతం బమియాన్ లో తొలిసారి పేలుళ్లు జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ సర్కార్ ..ప్రతీకారచర్యలు తప్పవని మిలిటెంట్లను హెచ్చరించింది.