ఉక్రెయిన్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. అర్థరాత్రి మిలటరీ విమానం కూలి 25 మంది మరణించారు. ఖర్కివ్ ప్రాంతంలో విమానం ఆకాశంలో వెళుతుండగా ఇంజన్ ఫెయిలవ్వడంతో కుప్పకూలిందని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో 25మంది మరణించగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 28 మంది ఉన్నారని పేర్కొంది. మృతుల్లో 21 మంది కేడెట్లుగా, నలుగురు క్రూ సిబ్బందిగా గుర్తించింది.