ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించింది. హరిద్వార్ సమీపంలో ఉదయం 9.41 భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. హరిద్వార్ కి 22 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు.