27 C
Hyderabad
Friday, December 4, 2020

ఓటర్లు రెండు సార్లు ఓటేయాలి: ట్రంప్‌

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు అందరిని టెన్షన్‌ పెడుతున్నాయి. కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు రెండు సార్లు ఓటేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మెయిల్ ఓటుతో పాటు బ్యాలెట్ ఓటును కూడా వినియోగించుకోవాల‌న్నారు. డెమోక్రటిక్‌ రిగ్గింగ్‌ కు పాల్పడే అవకాశాలున్నాయంటున్న ట్రంప్‌.. ఈ ప‌ద్ధ‌తిలో ఓటింగ్ నిర్వ‌హిస్తే, అక్ర‌మాలు జ‌ర‌గ‌వ‌న్నారు.  ట్రంప్‌ వ్యాఖ్యలపై కరోలినా ఎన్నికల బోర్డు మండిపడింది. రెండు ఓట్లు ఫెడరల్‌ చట్టానికి విరుద్ధమని పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....