28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

కరోనా కట్టడికి రష్యా తొలి వ్యాక్సిన్‌

కరోనా కట్టడికి ప్రపంచదేశాలు కృషి చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి. అయితే వ్యాక్సిన్‌ తయారీలో రష్యా ప్రపంచదేశాలకు మార్గం సుగమం చేసింది. గమ్‌ కోవిడ్‌ వ్యాక్‌ లయో పేరుతో తొలి టీకాను రిలీజ్‌ చేయనుంది. రేపు కరోనా వ్యాక్సిన్‌ ను విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపింది. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తయారు చేసిన ఈ టీకా..21రోజుల వరకు వైరస్‌ ను అడ్డుకుంటుందంటున్నారు సైంటిస్టులు. ముందుగా వైద్య సిబ్బందికి, ఉపాధ్యాయులకు టీకా ఇస్తామంటున్నారు. అయితే రష్యా టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షితమైన, సమర్థమైన టీకా అభివృద్ధికి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...