17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

కరోనా కేసులు తగ్గించేందుకు ట్రంప్‌ ఉపాయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు.  నిర్ధారణ పరీక్షలు  కత్తికి రెండు వైపులా పదును లాంటిదన్నారు. ఎక్కువ పరీక్షలు చేస్తేనే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అందుకే పరీక్షలు తగ్గించమని అధికారులకు చెప్పానని ట్రంప్ నిర్మొహమాటంగా వెల్లడించారు. అమెరికాలో  కరోనా కేసుల సంఖ్య 22 లక్షల 95 వేల 615కు చేరింది. వీరిలో లక్షా 21 వేల 441 మంది మరణించారు. వైరస్‌ ఉద్ధృతి ఎక్కవగా ఉండడంతో నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని తొలినాళ్లలో వైద్యనిపుణులు ట్రంప్‌నకు సూచించారు.  తాజాగా పరీక్షల్ని తగ్గించమన్నట్లు ట్రంప్‌ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.  

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...