అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో రిపోర్ట్ నెగిటివ్ అని తేలినట్టు వైట్ హౌస్ వైద్యులు తెలిపారు. ఫ్లోరిడా ప్రచార ర్యాలీకి ముందే కోవిడ్ నుంచి బయటిపడ్డారన్నారు. అయితే పరీక్షలకు ముందే.. మార్నింగ్ ఫ్యూచర్స్ హౌస్ట్ బార్టిరోమోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కోలుకున్నట్టు చెప్పారు ట్రంప్. తనకు రోగనిరోధక శక్తి ఉన్నందున హోం క్వారంటైన్ నుంచి బయటకు వెళ్లగలనని పేర్కొన్నారు.