18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

అమెరికాలో 24గంటల్లో 65వేల కరోనా కేసులు

అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతోంది. గంటగంటకు వైరస్‌ తీవ్రత అధికమవుతోంది. నిన్నటికి నిన్న రికార్డు స్థాయిలో 65వేల 551కొత్త కేసులు నమోదు అయినట్టు జాన్స్‌ హాప్కిన్స్‌ యునివర్సిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా  వైరస్‌ తో ఇప్పటి వరకు లక్షా 35వేల 825మందికి పైగా మృతి చెందితే.. బాధితుల సంఖ్య 32లక్షల 20వేలు దాటింది. 16లక్షల 57వేలమంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వీరిలో 16వేలమంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఇక కరోనాను తట్టుకుని 11లక్షల 52వేల 500మందికి పైగా కోలుకున్నారు. అయితే టెక్సాస్‌, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, న్యూజెర్సీ, అరిజోనా, కరోలినా రాష్ర్టాల్లో కరోనా కల్లోలం కలవర పెడుతోంది.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...