కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు చల్లారడం లేదు. గడిచిన 72 గంటల్లో శాన్ ప్రాన్సిస్ కు సమీపంలోని 46,000 ఎకరాల్లో కార్చిచ్చు చెలరుగింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ హెలికాప్టర్ కూలడంతో పైలెట్ మృతి చెందాడు. మంటలు అంతకంతకు విస్తరిస్తుండడంతో వైన్ ప్రాంతంలో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.దీంతో దాదాపు లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్. గతంలో ఎన్నడు ఇంతటి తీవ్రమైన మంటలను చూడలేదన్నారు.