కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులను హాస్పిటల్ కు తరలించారు. తమ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందన్న ట్రంప్.. వైద్యుల సూచన మేరకు వాల్టర్ రీడ్ మిలిటరీ హాస్పిటల్లో చేరినట్టు తెలిపారు. క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ట్రంప్ మేనేజర్ కి కూడా వైరస్ సోకినట్టు డాక్టర్లు దృవీకరించారు. ఆయనను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.