చైనాలో దారుణం జరిగింది. లౌహేలో ఓ షిప్పింగ్ కంపెనీ నిర్లక్ష్యం నాలుగు వేల మూగ జీవాలను బలితీసుకుంది. ఆన్ లైన్ లో పెంపుడు జంతువులను బుక్ చేసుకున్న వారి కోసం అధికారులు వారం క్రితం 5 వేల కుక్కలు, పిల్లులు, కుందేళ్లను ..ప్లాస్టిక్, కార్డ్ బోర్డ్ పెట్టెల్లో పార్శిల్ చేశారు. అయితే డాంగ్జింగ్ లాజిస్టిక్స్ కు పంపించిన అధికారులు వాటిలో పెట్స్ ఉన్నట్టు చెప్పడం మర్చిపోయారు. డెలివరీలో జరిగిన జాప్యంతో వారం పాటు ఆ పార్శిళ్లు షిప్పింగ్ సంస్థలోనే ఉండిపోయాయి. దీంతో తిండిలేక, ఊపిరాడక విలవిల్లాడిపోయిన ఆ మూగ జీవాలు మరణించాయి. ఒకేసారి నాలుగువేలకు పైగా జంతువులు మృతి చెందడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.