కరోనాకట్టడికి ప్రపంచదేశాలు వ్యాక్సిన్ తెచ్చే పనిలో తలమునకలవుతున్నాయి. ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న పలు టీకాల ప్రయోగాలు కీలక దశకు చేరాయి. అయితే అందరి కంటే ముందే వ్యాక్సిన్ తెస్తామన్న జాన్సన్ జాన్సన్ కంపెనీ ఇప్పుడు షాకిచ్చింది. వాలంటీర్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో..టీకా పరీక్షలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 60,000 మంది క్లినికల్ ట్రయల్స్ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఎన్రోల్మెంట్ వ్యవస్థ మూతపడింది. రోగుల భద్రతా కమిటి భేటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించిన కంపెనీ..ఎస్ఏఈకి కారణం ఏమిటనేది పరిశీలించి వ్యాక్సిన్ ట్రయల్స్ ను పునరుద్ధరిస్తామని తెలిపింది.
