అమెరికా ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్ కు షాకిచ్చారు కరోనా వైరస్ సలహాదారు స్కాట్ అట్లాస్. కరోనా వైరస్ వ్యాప్తిపై ట్రంప్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయనకు మెయిల్ చేసినట్టు ట్విట్టర్ లో తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి, అమెరికన్లకు సహాయం చేయడానికి నేను కష్టపడ్డానన్నారు స్కాట్ అట్లాస్. ఇక అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ఇన్కమింగ్ పరిపాలనకు ఆల్ ది బెస్ట్ అంటూ అట్లాస్ శుభాకాంక్షలు తెలిపారు.