19.4 C
Hyderabad
Monday, November 30, 2020

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ ఈ ఎన్నికల్లో ఢీకొంటున్నారు. 23.9 కోట్ల మంది ఓటర్లలో ముందస్తు బ్యాలెట్‌, మెయిల్‌ ఇన్‌ విధానం ద్వారా ఇప్పటికే 9.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అమెరికా ఓటర్లు 46వ అధ్యక్షుడి కోసం మాత్రమే కాకుండా ప్రతినిధుల సభల సభ్యులను ఎన్నుకోవటానికి కూడా ఓటు వేయనున్నరు. నాలుగేండ్లకోసారి అధ్యక్ష ఎన్నికలతోపాటు 435 స్థానాలున్న ప్రతినిధుల సభ-హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌  కు ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి కూడా ఓటర్లు ప్రతినిధుల సభ సభ్యులను ఎన్నుకోనున్నారు. అమెరికా చట్టసభల్లో అత్యంత కీలకమైన సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు కూడా ఓటింగ్‌ జరుగుతున్నది. సెనేట్లో నాలుగేండ్లకోసారి మూడోవంతు సీట్లు ఖాళీ అవుతాయి. వాటికి అధ్యక్ష ఎన్నికలతోపాటు ఓటింగ్‌ నిర్వహిస్తారు. వీటితోపాటు 11 రాష్ర్టాల గవర్నర్లను, రాష్ర్టాల చట్టసభల్లో ఖాళీ అయిన 86 స్థానాలకు సభ్యులను ఎన్నుకొనేందుకు కూడా అమెరికన్లు ఓటు వేయనున్నారు. 

అమెరికా కొత్త అధ్యక్షుడిని నిర్ణయించడంలో పెన్సిల్వేనియా, మిషిగన్‌, విస్కాన్సిన్‌, జార్జియా, ఫ్లోరిడా ఈ ఐదు రాష్ర్టాలే కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో మూడు రాష్ర్టాల్లో అంచనాలు తారుమారు కావడమే డెమోక్రాట్లకు అధ్యక్ష పీఠాన్ని దూరం చేసింది. డెమోక్రాట్లకు కంచుకోటలుగా భావించే బ్లూ వాల్‌ రాష్ర్టాలైన మిషిగన్‌, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియాలలో గత ఎన్నికల్లో  రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈసారి దానిని పునరావృతం కానీయకూడదని డెమోక్రాట్లు భావిస్తున్నారు. 

డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బిడెన్‌ సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా. డెమోక్రాట్లకు గతంలో బలమైన పట్టు ఉన్న మూడు రాష్ర్టాల్లో ఇది అతిపెద్దది. రూరల్‌, కన్జర్వేటివ్‌ ప్రాంతాల్లో గణనీయ ఓట్లను సాధించడంతోపాటు డెమోక్రాట్ల నుంచి శ్వేతజాతి వర్కింగ్‌ క్లాస్‌ ఓటర్లను తనవైపునకు తిప్పుకోవడంతో ట్రంప్‌ విజయం సాధించారు. మిషిగన్‌  రాష్ట్రంలోనూ ఈ సారి కూడా తిరిగి డెమోక్రాట్ల వశం కానుందని పోల్స్‌ చెబుతున్నాయి. ఇక్కడ ట్రంప్‌ కంటే బిడెన్‌ ఏడు పాయింట్ల ముందంజలో ఉన్నారు. 1984 ఎన్నికల తర్వాత విస్కాన్సిన్‌ రాష్ట్రంలో తొలిసారి గెలుపొందిన రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంపే. అయితే ఈసారి బిడెన్‌ ఇక్కడ ఆరు పాయింట్లు ముందంజలో ఉన్నట్లు ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. 

అటు 1992లో బిల్‌ క్లింటన్‌ విజయం సాధించేంతవరకు జార్జియా రాష్ట్రంలో డెమోక్రాట్‌ అభ్యర్థులెవరూ గెలుపొందలేదు. ఐతే ఈసారి పోరు హోరాహోరీగా సాగనుంది. జార్జియాలో ట్రంప్‌ కంటే బిడెన్‌ కేవలం 0.8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. మరోవైపు జనాభా పరంగా మూడో అతిపెద్ద రాష్ట్రం ఫ్లోరిడా. ఈ సారి ఫ్లోరిడాలో బిడెన్‌ 1.2 పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.