21.4 C
Hyderabad
Friday, December 4, 2020

ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజే 2,60,000 కరోనా కేసులు

ప్రపంచదేశాలను కరోనా కలవరపెడుతోంది. కేవలం 24 గంటల్లోనే 2,60,000పాజిటీవ్‌ కేసులు రావడంతో డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా దేశాల నుంచేనని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటీ 46లక్షల 34వేలకు చేరువ కాగా.. మరణాల సంఖ్య 6లక్షల 8వేల 600లు దాటినట్టు వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాలో లక్షా 43వేల 272మందికి పైగా కరోనాతో చనిపోతే.. పాజిటీవ్‌ కేసుల సంఖ్య 38లక్షల 98వేలకు ఎగబాకిందని తెలిపింది. బ్రెజిల్‌ 79వేల 533మంది మృత్యువాత పడితే మెక్సికోలో 38వేల 888మంది, రష్యాలో 12వేల 342మంది, స్పెయిన్‌ లో 28వేల 420మంది ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. యూకేలో 45వేల 300మంది ఈ మహమ్మారికి బలికాగా ఇటలీలో 35వేల 45మంది, ఇరాన్‌ లో 14వేల 188మంది, ఫ్‌రాన్స్‌ లో 30వేల 150మందికి పైగా మరణించినట్టు ప్రకటించింది.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...