అమెరికా ఎన్నికల ముందు భారత్, చైనా టెకీలకు ట్రంప్ సర్కార్ షాకిచ్చింది. హెచ్1-బీ వీసాల సంఖ్యను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశంలో ఉద్యోగ కల్పిన భారమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ ప్రాణాళికపై త్వరలోనే మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు వెల్లడించారు. హోమ్‌ల్యాండ్ డిపార్ట్మెంట్ రూపొందించిన కొత్త రూల్స్‌ను ఈ వారంలో ఫెడరల్ రిజిస్టార్లో పబ్లిష్ చేయనున్నారు. అయితే తాజా నిర్ణయంతో టెకీలు ఆందోళన చెందుతున్నారు.