23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

భారత్ జెండా రంగుల్లో నయాగరా

చరిత్రలో తొలిసారి నయాగరా జలపాతం సరికొత్త శోభను సంతరించుకున్నది. పాలనురగల ఈ జలపాతం మువ్వెన్నలతో మురిసిపోయింది.  భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇండో-కెనడియన్ కమ్యూనిటీ ఘనంగా నిర్వహించింది. కెనడాలోని పలు చోట్ల త్రివర్ణ పతకాలు రెపరెపలాడాయి. ఈ ఏడాది తొలిసారి నయాగరా జలపాతం దగ్గర కూడా వేడుకలు నిర్వహించారు. కెనడాలోని సుప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాలన్నీ మూడు రంగుల వెలుగులతో జిగేలుమన్నాయి. నయాగరా జలపాతం భారత జాతీయ పతాకం రంగులతో కాంతులీనింది. అటు టొరంటోలోని 553 మీటర్ల ఎత్తున్న సిఎన్ టవర్‌పై కూడా మువ్వన్నెల పతాకం సగర్వంగా ఎగిరింది.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...