ఓ వైపు ప్రపంచదేశాలు కరోనాతో కలవర పడుతుంటే..మరోవైపు డబ్ల్యూహెచ్వో చేసిన ప్రకటన మరింత టెన్షన్ కు గురి చేస్తోంది. రానున్నది అత్యంత క్లిష్టకాలమని తెలిపింది. కరోనా పరిస్థితులపై 34 సభ్యదేశాల ఎగ్జిక్యూటివ్ బోర్డుతో సమావేశం అయిన డబ్ల్యూహెచ్వో డాక్టర్ మైఖేల్ రయాన్ ..ప్రతి 10 మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలతో, జాన్సన్ హాకిన్స్ యూనివర్సిటీ అంచనాలు సరిపోయాయన్నారు.