23.2 C
Hyderabad
Sunday, August 9, 2020

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రతీ ఒక్కరికి అండగా ఉంటాం

హైదరాబాద్ లో జరిగిన యుఎస్ ఐబిసి ఇన్వెస్ట్ మెంట్ వెబినార్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, రిటైల్ వంటి రంగాల నుంచి పెట్టుబడిదారులు, పలు కంపెనీల అధినేతలు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇందులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ప్రధానంగా ఆధారపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే  ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతూ తీసుకున్న చర్యలను మంత్రి కేటీఆర్ వివరించారు.

భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు.. స్థూలంగా దేశాన్ని ఒక యూనిట్ గా కాకుండా తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలను యూనిట్ గా తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు ఉండే పెట్టుబడి అవకాశాలు, పరిస్థితులకు.. ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు ఉండే అవకాశాలకు చాలా తేడా ఉంటుందన్నారు. గత ఆరు సంవత్సరాల్లో దేశంలోని అనేక రాష్ట్రాల కన్నా భిన్నంగా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తూ వస్తున్నదని వివరించారు. దేశంలోనే అత్యంత తక్కువ వయసు కలిగిన రాష్ట్రమైన తెలంగాణ.. నూతన విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలపరంగా వినూత్నమైన పంథాలో ముందుకు పోతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆరు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నదని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం వినూత్నంగా ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్ విధానం విజయవంతం అయ్యిందని.. దీంతో కేవలం పదిహేను రోజుల్లోనే అన్ని రకాల పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటికే అనుమతులు పొందినవాటిలో 80 శాతానికి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించిందని చెప్పారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి బలమైన ఈకో సిస్టం రాష్ట్రంలో ఉందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైస్ పార్క్ తెలంగాణలో ఉన్నదని.. ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

యుఎస్ ఐబిసి ఇన్వెస్ట్మెంట్ వెబీనార్ లో పాల్గొన్న అమెరికన్ కంపెనీల అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా టీఎస్‌ ఐపాస్ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారంపైన రాష్ట్రం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసలు కురిపించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని యుఎస్ ఐబిసి ప్రెసిడెంట్ నిశా బిశ్వాల్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పరిశ్రమలకు అందిస్తున్న చేయూతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అటు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో యుఎస్ ఐబిసి అండగా ఉంటూ వస్తున్నదని.. భవిష్యత్తులోనూ దీన్ని  కొనసాగిస్తామన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభం తర్వాత పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు నిశా బిశ్వాల్‌.

- Advertisement -

Latest news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

Related news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో...

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేష్‌ ఉత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఇప్పటి వరకు గణేష్‌ ఉత్సవాలను...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్ కురువృద్ధ నేత, బడుగు- బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇక లేరు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స...