29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

విగ్రహాలు కూల్చిన వారిపై కఠిన శిక్షలు – ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డొనాల్డ్‌ ట్రంప్ శనివారం‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ..  తాను తీసుకున్న నిర్ణయంతో గర్వంగా ఉందన్నారు. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడేవారికి కఠిన కారాగార శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దేశంలోని స్మారక కట్టడాలను, విగ్రహాలను కాపాడుకునేలా ఆదేశాలు తీసుకొస్తామని  చెప్పారు. కాగా, జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య అనంతరం చోటు చేసుకున్న నిరసనల్లో వైట్‌ హౌస్‌ దగ్గరలోని మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్‌సన్‌ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు.

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...