18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

హైదరాబాద్ నుంచి అమెరికాకు ఆగకుండా వెళ్లొచ్చు

జ‌న‌వ‌రి 15న హైద‌రాబాద్ నుంచి అమెరికాకు నాన్ స్టాప్ ఫ్లైట్ అందుబాటులోకి తేనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాశ్రయ అధికారిక ప్రక‌ట‌న ప్రకారం 238(8 ఫ‌స్ట్ క్లాస్‌+ 35 బిజినెస్ క్లాస్‌+195 ఎకాన‌మీ క్లాస్‌) సీట్ల సామ‌ర్థ్యంతో బోయింగ్ 777-200 ఎయిర్‌క్రాఫ్ట్ న‌గ‌రం నుంచి అమెరికాకు బయల్దేరనున్నట్టు ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పానిక‌ర్ ప్రకటించారు. హైదరాబాద్-చికాగోలను కలిపే కొత్త నాన్-స్టాప్ మార్గం విమానాశ్రయానికి చెందిన కనెక్టివిటీ జాబితాలో ఉందని తెలిపారు.

ఏటా 7 ల‌క్షల‌కు పైగా ప్రయాణికుల సామ‌ర్థ్యంతో ఎయిరిండియా హైదరాబాద్-యుఎస్ఏ-హైదరాబాద్.. భారత్‌-యూఎస్‌ల మ‌ధ్య అతిపెద్ద పాసింజ‌ర్ మార్కెట్‌ను క‌లిగి ఉంది. హైద‌రాబాద్ న‌గ‌రం ద‌క్షిణ‌, మ‌ధ్య భార‌త‌దేశానికి ప్రవేశ ద్వారంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, నాగ‌పూర్‌, భువ‌నేశ్వర్‌, రాజ‌మండ్రి, భోపాల్‌, తిరుప‌తి న‌గ‌రాల‌కు హైద‌రాబాద్ అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతాల నుండి ఏడాదికి సుమారు 2 లక్షల 20 వేల మంది ప్రయాణికులు అమెరికాకు వెళ్లేందుకు డిమాండ్ ఉంది.

- Advertisement -

Latest news

Related news

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...