వైద్యశాస్త్రమంటే.. అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. ఎవరూ ఊహించని అద్భుతాలు వైద్యరంగంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా మరో సంచలనం కూడా జరిగింది. 27 ఏండ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం.. ఇప్పుడు ఊపిరి పోసుకొని పాప రూపంలో కళ్లు తెరిచింది.

అమెరికాకు చెందిన టీనా, బెన్ గిబనన్ దంపతులకు గత అక్టోబర్ 26న ఆడశిశువు జన్మించింది. ఆమెకు మొల్లి ఎవరెట్ గిబనన్ అని పేరు పెట్టారు. పుట్టింది పోయిన నెలలోనే అయినా.. ఆ పాప వయసు 27 ఏండ్లు. అలా.. ఎలా అని పరేషాన్ అయితున్నారా? ఆ పాప పిండాన్ని 27 ఏండ్ల క్రితం కృత్రిమ పద్ధతిలో టీనా గర్భాశయంలో ప్రవేశపెట్టారు. 1992లో మొల్లి పిండాన్ని ఫ్రీజ్ చేసి.. భద్రపరిచారు. 27 ఏళ్ల పాటు శీతలీకరణ దశలో ఉన్న ఆ పిండాన్ని.. కృత్రిమ పద్ధతిలో టీనా గర్భాశయానికి ఎక్కించారు. బేబీ మొల్లి గిబ్సన్ కంటే ముందు కూడా టీనా ఇదే తరహాలో ఓ ఆడ శిశువుకు జన్మనిచింది. 2017లో పుట్టిన ఆ అమ్మాయి పేరు ఎమ్మా వ్రెన్ గిబ్సన్.

అయితే ఎమ్మా కోసం 24 ఏళ్ల క్రితం దాచి ఉంచిన పిండాన్ని వినియోగించారు. మొల్లి, ఎమ్మాలు జన్యుపరంగా అక్కాచెళ్లులు అవుతారు. ఈ ఇద్దరి పిండాలను 1992లో ఓ దంపతులు దానం చేశారు. అప్పటి నుంచి ఒకే దగ్గర ఈ రెండు పిండాలను ఫ్రీజ్ చేశారు. అద్దె పిండాలతో ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిన టీనా.. మొల్లి గిబ్సన్ కన్నా ఒక ఏడాది ముందు జన్మించడం విశేషం. ఎంబ్రియో అడాప్షన్ విధానం గిబ్సన్ దంపతులకు కొత్త జీవితాన్నిచ్చింది. ఐవీఎఫ్ చికిత్స చేసుకునే వారు.. అదనంగా పిండాలను దానం చేయాల్సి ఉంటుంది. అయితే పిల్లలు కాని వారు, ఆ పిండాలను దత్తత తీసుకుంటారు. ఎవరైనా పిండం కావాల్సిన వారు.. వచ్చే వరకు ఆ పిండాలను మైనస్ ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తారు.