మన శరీరంలో అన్నింటికంటే ముఖ్యమైన ఆర్గాన్ గుండె. గుండె లేనిదే మనిషి బతకలేడు. అయితే ఏటా లక్షలాది మంది అచ్చంగా గుండె సంబంధ వ్యాధులతో చనిపోతున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లమ్ గా మారింది. ఇప్పుడా ప్రాబ్లమ్ కు సొల్యూషన్ దొరికింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ.. మొదటిసారిగా కృత్రిమ గుండెను రూపొందించి రికార్డుకెక్కింది.

ఒకసారి గుండె ఫెయిల్ అయితే.. ఆ గుండె తీసి మరో గుండె పెడితేగానీ బ్రతకడం కష్టం.. కానీ గుండెను దానం చేసే దాతలు చాలా తక్కువగా ఉంటారు. అయితే త్వరలో రాబోతున్న ఆర్టిఫీషియల్ హార్ట్ తో ఈ సమస్యలన్నీ తీరతాయి. ఫ్రాన్స్‌కు చెందిన కర్మాట్ అనే కంపెనీ కృత్రిమ గుండెను తయారుచేసింది. అంతేకాదు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్‌ను యూరప్ దేశాల్లో ఉపయోగించేందుకు అనుమతి కూడా లభించింది.

కార్మాట్ సంస్థ రూపొందించిన ఆర్టిఫీషియల్ హార్ట్ పేరు ఏసన్ (Aeson). ఇది లిథియం అయాన్ బ్యాటరీలతో పని చేస్తుంది. రక్తసరఫరా సాఫీగా జరిగేలా ఇందులో సెన్సర్లు, హైడ్రాలిక్ సిస్టమ్‌ను డెవలప్ చేశారు. వ్యాయామం చేసినప్పుడు వచ్చే మార్పులకనుగుణంగా ఈ ఆర్టిఫీషియల్ హార్ట్ లో రియల్ టైమ్ బ్లడ్ సర్కులేషన్ సిస్టమ్ ఉంటుంది.

సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడే వారు.. దాతలు గుండె దానం చేస్తేనే బతుకుతారు. లేదంటే చనిపోవడమే. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్టిఫీషియల్ హార్ట్.. నిజంగానే పునర్జన్మ ప్రసాదించనుంది అని కర్నాట్ సీఈవో స్టీఫెన్ పియట్ తెలిపారు. ఈ ఏడాదే ఫ్రాన్స్, జర్మనీలో వేలాది మంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్లకు ఆర్టిఫీషియల్ గుండెను అమర్చి కొత్త జీవితం ప్రసాదిస్తామని ఆయన అన్నారు. ఈ ఆర్టిఫీషియల్ హార్ట్ కొన్ని నెలల్లోనే అందుబాటులోకి రానుంది.