వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో)కు కొత్త చీఫ్ గా నైజీరియాకు చెందిన నోజి ఒకాంజో ఇవేలా నియమితులు కానున్నారు. ఈ మేరకు అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. డబ్ల్యూటీవోకు తొలి మహిళా చీఫ్గా.. తొలి ఆఫ్రికా నేతగా కూడా ఒకాంజో నిలవనున్నారు. ఆర్థికశాస్త్రం, అంతర్జాతీయ దౌత్యవిధానంలో నోజి ఒకాంజోకు అపారమైన అనుభవం ఉన్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి శాఖ చెప్పింది.
దక్షిణ కొరియాకు చెందిన వాణిజ్య మంత్రి యో మయుంగ్ను డబ్ల్యూటీవో చీఫ్గా చేయాలని అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నోజి ఒకాంజోకు బైడన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వగానే.. కొరియాకు చెందిన మంత్రి ఆ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.