29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

అమేజాన్ సీఈవోగా తప్పుకోనున్న జెఫ్ బెజోస్

మొన్నటి వరకూ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు , అమెజాన్ ఫౌండర్.. జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మూడో క్వార్టర్ లో అమెజాన్ సీఈవోగా తన పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బెజోస్ తర్వాత.. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసుల హెడ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ జాసీని సీఈవోగా నియమించాలని నిర్ణయించారు.
అమెజాన్ వర్కర్లంఅందరికీ బెజోస్ ఓ లేఖ రాశారు. సీఈవోగా తప్పుకున్నప్పటికీ అమెజాన్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తాను కూడా పాలుపంచుకుంటానని ఆయన వర్కర్లకు తెలియజేశారు. రిటైర్‌మెంట్ తర్వాత సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

- Advertisement -

Latest news

Related news