29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

మ‌య‌న్మార్‌కు అమెరికా వార్నింగ్

మ‌య‌న్మార్‌లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో అమెరికా సీరియస్ అయింది. ప్రెసిడెంట్ జో బైడెన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మయన్మార్ పై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను సైనిక శ‌క్తితో అణచివేయడం తగదన్నారు. అర్థం లేని ఆరోపణలతో ప్రజాస్వామ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తోసిపుచ్చ‌లేరని బైడెన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్ర‌జాస్వామ్యంపై దాడి జ‌రిగితే అమెరికా చూస్తూ ఊరుకోదని బైడెన్ చెప్పారు.  మయన్మార్ లో సైనిక తిరుగుబాటుపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి, బ్రిట‌న్‌, ఈయూ కూడా ఈ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించాయి.

గతేడాది నవంబర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు  సిద్ధమవుతున్న వేళ ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైన్యం మరోసారి తిరుగుబాటు చేసింది.  ఎన్ఎల్డీ అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకీతోపాటు మయన్మార్ ప్రెసిడెంట్ ని నిర్బంధంలో ఉంచారు. ఏడాది పాటు పాలనను స్వాధీనం చేసుకుంటున్నామని సైన్యం ప్రకటించింది. 1989 నుంచి 2010 వ‌ర‌కు సుమారు 15 ఏళ్ల పాటు నిర్బంధంలో ఉన్న సూకీ.. సైనిక తిరుగుబాటుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టాల‌ని ఓ లేఖ‌లో ఆ దేశ ప్రజలకు సూకీ కోరారు.

- Advertisement -

Latest news

Related news